కివీస్‌ టి20 జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి 20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ 14 మందితో కూ డిన జట్టును బుధవారం ప్రకటించింది. కేన్‌ విలియమ్సన్‌ ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన న్యూజిలాండ్‌ ఇక మిగిలిన టి20 సిరీస్‌లోనైన గెలిచి తమ పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకోసం టి20 జట్టులో భారీ మార్పు లు చేసింది. ఈ స్కాడ్‌లో ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లే యర్లు ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌, ఫాస్ట్‌ బౌలర్‌ బ్లాయెర్‌ టిక్నర్‌లను తీసుకోవడం జరిగిం ది. ఈ టోర్నీ ద్వారా వీరిద్దరూ అంతర్జాతీయా క్రి కెట్‌లో అరంగ్రేటం చేస్తారు. మిచెల్‌ పేరు మూ డు మ్యా చ్‌లలో ఉండగా టిక్నర్‌ పేరు మాత్రం ఆఖరి మ్యా చ్‌ స్కాడ్‌లో మాత్రమే ఉంది. ఇక చివరి టీ20 మ్యాచ్‌లో సీనియర్‌ ఆటగాడు లూకి ఫెర్గ్యూసన్‌ స్థానంలో యువ ఆటగాడు టిక్నర్‌ను ఆడిస్తున్న ట్టు న్యూజిలాండ్‌ సెలెక్టర్‌ గావిన్‌ లార్సెన్‌ తెలిపా రు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 6 నుం చి ఈ టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్‌ టి20 జట్టు
కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), బ్రాస్‌వెల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, లూకి ఫెర్గ్యూసన్‌ (తొలి రెండు మ్యాచ్‌లకు), మార్టిన్‌ గుప్టిల్‌, స్కాట్‌ కుగెలెజిన్‌, డారిల్‌ మిచెల్‌, కొలిన్‌ మున్రో, మిచెల్‌ సాంట్నర్‌, టిమ్‌ సైఫెర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఇష్‌ సోధీ, టిమ్‌ సౌ థీ, రాస్‌ టేలర్‌, బ్లాయెర్‌ టిక్నర్‌ (మూడో మ్యాచ్‌కి).

DO YOU LIKE THIS ARTICLE?