‘కాళేశ్వరం’ పనులకు రూ.7785 కోట్ల రుణం

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కోసం కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.7785 కోట్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం బుధవారం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుకు చెందిన పిహెచ్‌,ఫోర్‌బే, ఇఎం, హెచ్‌ఎం, ప్రెషర్‌ మెయిన్స్‌, గేట్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం పనుల కోసం రూ. 5405.39 కోట్లు రుణం తీసుకుంటోంది. అలాగే పైప్‌లైన్లు, పైప్‌లైన్‌ ఇరిగేషన్‌ సిస్టం (ఎంఎస్‌, డిఐ, హెచ్‌డిపిఇ), వాల్వ్‌లు, థ్రస్ట్‌ బ్లాక్స్‌ తదితర పనుల కోసం రూ.2379.56 కోట్లు రుణంగా తీసుకుంటోంది. ఈ రుణం పొందేందుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?