కార్మిక హక్కులను కాలరాస్తూ.. కార్పొరేట్లకు ఊడిగం

మోడీ, బిజెపి విధానాలపై అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శ

ప్రజాపక్షం / హైదరాబాద్‌  : దేశ సంపదను దోచుకుంటున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ కాపలాగా ఉంటున్నారని ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ అన్నారు. సంపన్నులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు మోడీ దాసోహమయ్యారని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ, వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆమె అన్నారు. ఒక పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తూ ప్రభత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల ను కాలరాస్తూ వారిపై దాడికి ఒడిగడుతున్న మోడీ కి లోకసభ ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి) రాష్ట్ర రెండ వ మహాసభల సందర్భంగా ‘సలామ్‌ షాహిద్‌ ప్రాంగణం’ (నవజ్యోతి యూత్‌క్లబ్‌ మైదానం)లో ఆదివారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. సభకు ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహన్‌ అధ్యక్షత వహించగా ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా రూపొందించి మొత్తం కార్మిక వర్గానికే ద్రోహం చేశారని ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, చట్టాల రక్షణ కోసం కార్మిక వర్గం రెట్టింపు ఉత్సాహంతో మరో పోరాటానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కార్మికులపై దాడులు మరింత తీవ్రతరమవుతాయన్నారు. లోకసభ ఎన్నికల్లో గెలిచేందుకు అబద్ధాలు, మోసపూరిత ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. చౌకీదార్‌గా చెప్పుకుంటున్న ప్రధాని మోడీ దేశ సంపదను దోచుకుంటు న్న వారికి కాపలాగా ఉంటున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి విజయ్‌ మాల్యా రూ.9 వేల కోట్లు,  నీరవ్‌ మోడీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుండి రూ.12 వేల కోట్లు దోచుకొని విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచని పాలకవర్గాలు దేశాన్ని దొచుకుంటున్న వారికి మాత్రం రక్షణ కల్పిస్తూ విదేశాలకు పారిపోయేందుకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎఐటియుసి అగ్రభాగాన నిలిచిందని, కార్మిక వర్గాన్ని సమీకరించి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి మాత్రమేనని అన్నారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, నాటి రాష్ట్రపతి వివి గిరి వంటి ఉద్దండులు ఎఐటియుసి సమావేశాల్లో పాల్గొని ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారని గుర్తు చేశారు. కార్మిక వర్గానికి కనీసం పెన్షన్‌ కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్‌, పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను కార్మిక వర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మోడీ పాలనలో కార్మికవర్గంపై దాడులు పెచ్చు పెరిగిపోయాయన్నారు. 2015, 2019లో దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో 20 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొని ప్రభుత్వ విధానాలను నిరసించినా మోడీ ప్రభుత్వానికి చలనం లేదన్నారు. పుల్వామా ఘటనను సైతం రాజకీయ లబ్ధికోసం మోడీ వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వేలాది పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జిఎస్‌టి వల్ల పెట్టుబడిదారులకు మేలు జరిగింది తప్ప సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు గుదిబండగా మారిందన్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు నరసింహన్‌ మాట్లాడుతూ 98 సంవత్సరాలుగా కార్మిక పోరాటాలు చేస్తూ వస్తున్న చరిత్రాత్మక నేపథ్యం ఎఐటియుసికి ఉందన్నారు. స్వాతంత్య్ర సమరంలో కార్మికులను సమీకరించి అగ్రభాగాన నిలిచిందన్నారు. ఎర్రజెండా నీడలోనే కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పోరాడి సాధించుకున

DO YOU LIKE THIS ARTICLE?