కార్తిక్‌ ఓకే.. పంత్‌ను పరీక్షిస్తున్నాం..

చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌
ముంబయి: ఇంగ్లాండ్‌ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో దినేష్‌ కార్తిక్‌కు చోటు లేదని ఇటీవలే వస్తున్న వార్తల్లో సత్యంలేదని టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. వరల్డ్‌ప్‌ కోసం తాము ఎంపిక చేసే భారత జట్టులో దినేష్‌ కార్తిక్‌కు దారులు మూసుకుపోలేదని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కార్తీక్‌కు చోటివ్వకపోవడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. దినేష్‌ను వరల్డ్‌ప్‌ నుంచి తప్పించే క్రమంలోనే అతనికి ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి ఉద్వాసన పలికారనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్‌ మరోసారి క్లారిటి ఇస్తూ.. తాము కార్తిక్‌ను ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి కారణం ఉంది. దినేష్‌కు అవకాశాలు కల్పించాం. అందులో అతను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువ క్రికెటర్‌కు పరీక్షిస్తున్నాము. ప్రపంచకప్‌కు ముందు పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భావించామని ఆయన అన్నారు. ప్రస్తుత భారత జట్టులో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. గత కొంతకాలంగా దినేష్‌ కార్తిక్‌ మ్యాచ్‌ ఫినిషింగ్‌ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి ఇచ్చిన అవకాశాల్ని కార్తిక్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. అయితే వికెట్‌ కీపర్‌ బ్యాకప్‌ స్లాట్‌ కూడా ముఖ్యమే. అందుకే రిషభ్‌కు అవకాశాలు కల్పించి పరీక్షిస్తున్నాం. కార్తిక్‌ ప్రదర్శనపై మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇంకా ప్రపంచకప్‌ జట్టు ఫైనల్‌ చేయలేదు. అది అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా సిరీస్‌ కీలకం. ఇందులోనూ కొందరి ఆటను పరీక్షిస్తున్నామని ప్రసాద్‌ చెప్పారు. గత కొంత కాలంగా ఈ యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పరిణితి సాధించిన క్రికెటర్‌గా పంత్‌ ఎదిగాడు. ఇద్దరికి పోటీ లేదని ఎవకికి వచ్చిన అవకాశాన్ని వారు పూర్తిగా అస్వదించారు. ఇద్దరూ సమానంగానే తమ తమ అవకాశాల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక జట్టు అవసరాన్ని బట్టి వారిని ఎంపిక చేస్తున్నామని ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?