కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు

పెట్రో ధరలకు నిరసనగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు వెళ్తుండగా అడ్డగింత
ప్రజాపక్షం / హైదరాబాద్‌  పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలకు నిరసనగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు సోమవారం గాంధీభవన్‌ నుంచి బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్‌ గేటు దాటగానే పోలీసులు వారిని ఆపేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, యువజన కాం గ్రెస్‌ రాష్ర్ట అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులతో పాటు ఇతర నాయకులు గుర్రం బండి మీద, గుర్రాలమీద కలెక్టరేట్‌కు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని నిలిపివేశారు. అనంతరం హైదరాబాద్‌ కలెక్టర్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులను అనుమతించారు. దీంతో ఎఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి, పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, దాసోజు శ్రవణ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

DO YOU LIKE THIS ARTICLE?