కవిత ఎంపిక వెనుక త్రిముఖ వ్యూహం

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : శాసనమండలికి మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఎంపిక వెనుక త్రిముఖ వ్యూ హం ఉన్నట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. దాదా పు మూడు వారాల క్రితమే ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది. అటు పెద్దల సభలో పట్టు, నిజామాబాద్‌లో పార్టీకి అండ, బిజెపికి అడ్డుకట్ట వేసేందుకే కవితను నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి సిఎం కెసిఆర్‌ ఎంపి చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ స్థానం నుండి టిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపిగా ఉన్న కల్వకుంట్ల కవిత ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆమె ఓటమిని నిజామాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. దీంతో సుమా రు పది నెలలుగా ఆమె నిజామాబాద్‌ రాజకీయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలకు కొం త దూరంగానే ఉన్నారు. నిత్యం బతుకమ్మ పండగలో అగ్రభాగాన నిలిచే కవిత గత బతుకమ్మ కార్యక్రమానికి కూడా దూరంగానే ఉన్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుండి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వర్గంలోనికి వేముల ప్రశాంత్‌రెడ్డికి అవకాశం లభించిం ది. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌కు, పార్టీకి మధ్య సఖ్యత కొరవడింది. దీనికి తోడు ఆయన కుమారుడు అరవింద్‌ కుమార్‌ నిజామాబాద్‌ ఎంపిగా గెలుపొందారు. ఇందులో డిఎస్‌ కీలకపాత్ర పోషించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా 28 సీట్లను సాధించి కార్పొరేషన్‌లో బిజెపి పెద్ద పార్టీగా నిలిచింది. కేవలం ఒక ఎంపి మినహా ఎంఎల్‌ లు, ఒక మంత్రి ఉన్నప్పటికీ బిజెపి విజయాన్ని అక్కడి టిఆర్‌ఎస్‌ నేతలు నిలువరించలేకపోయారనే వాదన పార్టీలో బలంగా ఉన్నది. పైగా ఈ జిల్లాలో బిజెపి బాగా నే పుంజుకుంటుంది. మరో వైపు నిజామాబాద్‌కు పెద్ద దిక్కుగా ఉన్న కవిత కూడా దూరంగా ఉండడంతో అక్క డి పార్టీ శ్రేణుల్లో పెద్దగా జోష్‌ కనిపించడం లేదు. ఈ క్రమంలో కవితను ఎంఎల్‌సిగా బరిలో దింపడం ద్వారా ఉమ్మడి నిజామబాద్‌ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండడం, పార్టీ నేతలు, శ్రేణుల్లో జోష్‌ పెరుగుతుంది. బిజెపి ఎదుగుదలను అడ్డుకట్ట వేసేందుకు ఒక అవకాశం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతన్నాయి. స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఉండడం ద్వారా దాదాపు నిజామాబాద్‌ లో క్‌సభ నియోజకర్గానికి ప్రొటోకాల్‌ ప్రకారం కవిత ఒక ప్రతినిధిగా కూడా ఉండే అవకాశం ఉన్నది. అదే జిల్లాలో ఉంటూ ఎప్పటికప్పుడు క్యాడర్‌కు అందుబాటులో ఉంటే పార్టీ మరింత బలపడడం, అలాగే బిజెపికి చెక్‌ పెట్టే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తీరిన ‘పెద్ద’ లోటు : పెద్దల సభకు(శాసనమండలి) వెళ్లడం ద్వారా ఆ సభలో కూడా ఒక ‘పెద్ద’ లోటు తీరు తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శాసనమండలికి టిఆర్‌ఎస్‌ పక్ష నేత, అలాగే శాసనమండలి పక్ష నే త లేనిలోటు కూడా కవిత ఎంపికతో తీరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో శాసనమండలి నుండి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులుగా కడి యం శ్రీహరి, మహమూద్‌అలీ ఉన్నారు

DO YOU LIKE THIS ARTICLE?