కలెక్టర్‌ పేరు మారుస్తాం

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తాం
మహబూబాబాద్‌, ఖమ్మం సభల్లో కెసిఆర్‌

ప్రజాపక్షం/మహబూబాబాద్‌/ఖమ్మం బ్యూరో: త్వరలో రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. అలాగే రెవెన్యూ శాఖ పేరుతో సహా చట్టాన్ని మారుస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ పేరు కూడా మార్చే ఆలోచనలో ఉన్నామని వివరించారు. మహబూబాబాద్‌, ఖమ్మంలలో గురువారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ భూము ల వివాదాలు లేకుండా భూ ప్రక్షాళన జరగాలన్నారు. ఆ రకంగా చర్యలు చేపడుతున్నట్లు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రతి ఎక రా భూమి ఎవరికి ఉంది, వివాదం లేకుండా చేయటమే భూప్రక్షాళన ప్రధాన ఉద్దేశ్యమన్నా రు. రెవెన్యూ అనే పదం సరైన విధంగా లేదని, బ్రిటిష్‌ నాటి చట్టాలు రెవెన్యూ సిస్తులకు ఉద్దేశించిన అంశంగా పేర్కొంటూ అవి రద్దయిపోయి చాలా కాలమైందని, తమ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందన్నారు. అంతేకాక జిల్లా రెవెన్యూ అధికారి పేరును జిల్లా పరిపాలన అధికారిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో జాతీయ పార్టీలు రెండు చోర్‌ అంటే చోర్‌ అని ప్రజలను పక్కదోవ పట్టించే పరిస్థితి నెలకొందని, ప్రజలు ఎవరూ వారి మాటలను నమ్మవద్దని బిజెపి, కాంగ్రెస్‌లను ఉద్దేశించి అన్నారు. పార్లమెంటు ఎన్నిక ల్లో కాంగ్రెస్‌, బిజెపిలకు మెజార్టీ వచ్చే అవకాశమే లేదని కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగనుందని తెలిపారు. బిజెపికి 130,140 సీట్లు, కాంగ్రెస్‌కు 100కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని 200 నుంచి 250 సీట్లు ప్రాంతీయ పార్టీలు గెలుచుకోనున్నాయని ఆయన జోస్యం తెలిపారు. దేశంలో దారిద్య్రానికి, చిమ్మ చీకటికి 66 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌, బిజెపిలే కారణమన్నారు. వాస్తవాన్ని మరచి రెండు పార్టీల నేతలు మైకుల ముందు వీరంగం వేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో క్రీయాశీలక పాత్ర పోషించనున్నాయని 16కు 16 సీట్లు తెలంగాణ నుంచి టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చునన్నా రు. 1947లో నెహ్రూ దరిద్రో నారాయణ అంటే ఇందిరా గాంధీ గరీబీ హఠావో అందని, రాజీవ్‌ గాంధీ పేదరిక నిర్మూలన అంటే ఇప్పుడు రాహు ల్‌ గాంధీ ఇంకేదో చెబుతున్నారని, కేంద్రా న్ని పాలించిన వారికి చిత్తశుద్ధ్ది లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?