కలిసికట్టుగా ఆడితేనే..

ఒకడితో ప్రపంచకప్‌ గెలవలేం: సచిన్‌
స్యూఢిల్లీ : కోహ్లీ ఒక్కడి పోరాడటం వల్ల ప్రపంచకప్‌ను గెలవలేమని, జట్టు మొత్తం కలిసిగట్టుగా రాణిస్తేనే విజయం సాధ్యమని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ పలు ఆసక్తికరమైన అంశాలు అభిమానులతో పంచుకున్నాడు. ఈసారి ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు భారత్‌కే అధికంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ గెలవాలంటే జట్టులోని ప్రతి ఒకరు చెమటోడ్చాల్సిందే. ఒక్కడి వల్ల ట్రోఫీ గెలవలేం. ఇది అసాధ్యం కూడా. ప్రతి మ్యాచ్‌లో అందరూ కలిసి కట్టు రాణించాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో జట్టు సభ్యులు మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. ఒకరు విఫలమైన మరొకరూ జట్టును ఆదుకొవాల్సిన అవసరం ఎంతైన ఉంటుంది. కీలకసమయాల్లో తలో చెయ్యి వేసి ప్రత్యర్థిని ఓడించాలి. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్లో నాలుగో స్థానం గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. నా దృష్టిలో అది ఒక నంబర్‌ మాత్రమే. దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. మన జట్టులో ఎంతో మంది నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్‌ సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ స్థానం గురించి ఎక్కువ చర్చలు జరపాల్సిన అవసరంలేదు. జట్టులో అందరూ ప్రతిభ వంతులే అన్న విజయాన్ని గుర్తిస్తే చాలు. ఇక ప్రపంచకప్‌ మెగా సమరం కోసం ఇప్పటికే మన ఆటగాళ్లు కావాల్సినంత క్రికెట్‌ ఆడారు. వారు ఈసారి భారత్‌కు మూడో ప్రపంచకప్‌ ట్రోఫీని అందిస్తారని సచిన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లాండ్‌ ఫ్లాట్‌ పిచ్‌లు ఈసారి బౌలర్లకు సహరించడంలేదు. అందుకే ఈసారి ప్రపంచకప్‌లో భారీ పరుగులు నమోదవడం ఖాయం. ఇలాంటి పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌లకు వరం లాంటివి. కానీ బౌలర్లకు పీడకల్లాంటివి. ఈ టోర్నీ బౌలర్ల సత్తాకు పరీక్ష పెట్టనుంది. పేస్‌ బౌలర్లకు ఈ పిచ్‌లపై ఎలాంటి సహకారం అందదు. స్పిన్నర్లు తెలివిగా బౌలింగ్‌ చేస్తే వికెట్లు తీయగలరు. ఈసారి ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల ప్రదర్శనే కీలకంగా మారనుంది. ఇక ఇంగ్లాండ్‌లో కోహ్లీ బృంధం మంచి ఫలితాలు సాధిస్తోంది. ప్రస్తుతం జట్టులో కెప్టెన్‌ కోహ్లీ, సీనియర్‌ ధోనీ, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కెఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌లో ఎవరికి అవకాశం లభించిన సత్తా చాటుతారు. వీరితో పాటు జట్టు కీలక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌లో ముఖ్య భుమిక వహించనున్నాడని సచిన్‌ తెలిపాడు. బౌలింగ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌, మహ్మద్‌ షమీలతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. స్పిన్‌లో కుల్దీప్‌, చాహల్‌, రవీంద్ర జడేజాలు మెరుగైన ప్రదర్శనలు చేయగలరు అని సచిన్‌ పేర్కొన్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?