కరోనా ‘పరీక్షల్లో’ మనమే లాస్ట్‌

ఆరు రాష్ట్రాల్లో తెలంగాణే తక్కువ
ప్రజాపక్షం/హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించిన ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం చివరిస్థానంలో నిలిచింది. పరీక్షల నిర్వహణ, పాజిటివ్‌ కేసుల విషయంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, ద్వితీయ స్థానంలో గుజరాత్‌ ఆ తర్వాత మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదని, పాజిటివ్‌ సంఖ్య విషయం లో ప్రతిపక్షాల విమర్శలు, హైకోర్టు వ్యా ఖ్యల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం లో నిర్వహించే లెక్కలను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ నెల 14వరకు తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల లెక్కల వివరాలను తెలియజేసింది. కేరళ రాష్ట్రంలో 39,380 పరీక్షలు నిర్వహించగా ఇందులో 534 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 22,842 మందికి పరీక్షలు నిర్వహించగా 1388 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,30,857 పరీక్షలు నిర్వహిస్తే ఇందులో 25,922 పాజిటివ్‌ కేసులు, తమిళనాడులో 2,79,467 మందికి పరీక్షలు నిర్వహించగా 9227 పాజిటివ్‌ కేసులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లో 2,01,196 పరీక్షలు నిర్వహించగా 2137 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ రాష్ట్రాలలో మొత్తం 19,47,041 పరీక్షలు నిర్వహించగా 78,057 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ ఐసిఎంఆర్‌ నిబంధనల ప్రకారమే పరీక్షలును నిర్వహిస్తున్నామని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తులకు పది రోజుల పాటు చికిత్స అందించి, పరీక్షలు నిర్వహించకుండానే వారిని పం పించాలని, ఆ తర్వాత హోమ్‌ ఐసోలేషన్‌లో పెట్టి, ఉదయం, సాయం త్రం వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించాలని ఐసిఎంఆర్‌ నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు ఈటల రాజేందర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్ధారణ పరీక్షలను వెల్లడదించారు. కాగా ఆరు రాష్ట్రాల కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. కేరళ రాష్ట్రం లో 39,380 మందికి పరీక్షలు నిర్వహిస్తే అక్కడ 534 పాజిటివ్‌ కేసులు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 22,842 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఆ రాష్ట్రం కంటే ఎక్కువస్థాయిలో 1388 కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?