కరోనాతో జర్నలిస్ట్‌ మనోజ్‌ మృతి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : నగరంలో కరోనా వైరస్‌ బారిన పడి జర్నలిస్ట్‌ ప్రాణాలు విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న జ ర్నలిస్ట్‌ మనోజ్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి విషయమించటంతో ఆదివారం కన్నుమూశారు. మాదన్న పేటకు చెందిన మనోజ్‌ పలు టి.వి ఛా నళ్లలో క్రైమ్‌ రిపోర్టుగా పనిచేశారు. ప్రస్తుతం మ నోజ్‌ టి.వి5 ఛానల్‌లో క్రైం రిపోర్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాతో మనోజ్‌ మృతి చెంద డం పట్ల పలువురు జర్నలిస్టులు, రాజకీయ నేత లు సంతాపం తెలిపారు.
మనోజ్‌ మృతి మనోవేదన కలిగించింది : ఈటెల
యువ జర్నలిస్ట్‌ మనోజ్‌ మృతి తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మనోజ్‌ను బతికించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్యులు తీవ్రం గా కృషి చేశారని అన్నారు. ఆయన ఆత్మకు శాం తి కలగాలని కోరుకుంటున్నాని ఈటల అన్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మనోజ్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం : నారాయణ
మనోజ్‌ మృతికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరో నా బారిన పడి ఓ తెలుగు జర్నలిస్ట్‌ మృత్యువాత పడటం ఎంతో కలచి వేసిందన్నారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జ ర్నలిస్టులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మ నోజ్‌ మరణం హెచ్చరిస్తుంది అని అన్నారు. మనోజ్‌ కుటుంబ సభ్యు లు ధైర్యంగా ఉండాలన్నారు.
ఆన్‌లైన్‌లోనే ప్రెస్‌ మీట్‌లు పెట్టండి:టియూడబ్ల్యుజె
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా రాజకీయులు, పో లీసులు ఆన్‌లైన్‌ ద్వారానే ప్రెస్‌ మీట్‌లు పెడితే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టియూడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్‌, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీలు సూచించారు. ఆయా ప్రెస్‌ మీట్‌ల కవరేజికి వెళ్లడం ద్వారానే ఇప్పటికే పలువురు జర్నలిస్టులు కరోనా కాటుకు గురయ్యారని అన్నారు. ఈ పరిస్థితుల్లోనే యువ పాత్రికేయుడు మనోజ్‌ బలై పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని వార్తల కవరేజీలో యాజమాన్యాలు జర్నలిస్టులపై ఒత్తిడి తేవద్దని కోరుతున్నాం. కరోనాతో మృతి చెందిన యువ జర్నలిస్ట్‌ మనోజ్‌ కుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శేఖర్‌, విరాహత్‌ అలీలు విజ్ఞప్తి చేశారు.
మనోజ్ మృతి‌ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది : చాడ
టివి5 జర్నలిస్టు మనోజ్‌ కుమార్‌ కరోనా వల్ల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపా రు. చిన్న వయసులోనే అతను మరణించడం బా ధాకరమన్నారు. మనోజ్‌ మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనోజ్‌ రాష్ట్ర ప్ర భుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ. 50 లక్షల బీమా వర్తింప చేయాలని ఆయన ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు పిపి ఇ కిట్లను, మాస్క్‌లు, శాటిలైజర్లను ప్రభు త్వం అందజేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?