కనీవినీ ఎరుగని ఆర్థికమాంద్యం!

భారత్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదుర్కొంటున్నది : గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ
న్యూఢిల్లీ: భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక మాంద్యం నెలకొన్నది. ఈ విషయాన్ని గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా గతరెండు నెలలుగా దేశంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ సమయంలో భారత్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా మాంద్యాన్ని ఎదుర్కొన్నదని, దీని ప్రభావం సమీప భవిష్యత్‌లో మరింత తీవ్రంగా వుండబోతున్నదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌ అంచనా వేసింది. గడచిన మూడు నెలలను పరిశీలస్తే ప్రస్తుత రెండో త్రైమాసికం నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)45 శాతానికి పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. గతంలో విడుదల చేసిన నివేదికలో మాత్రం కేవలం 20శాతం తగ్గుదల ఉంటుందని గోల్డ్‌ మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. అయితే ఇది మూడో త్రైమాసికం నాటికి 20 శాతం పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా నాలుగో త్రైమాసికంలో 14 శాతం, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో 6.5 శాతం వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. ఈ అంచనాల ప్ర కారం, వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరం నాటికి వాస్తవ జిడిపి 5శా తం క్షీణించే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఆర్థిక నిపుణులు ప్రచీ మి శ్రా, ఆండ్రూ టిల్టన్‌ అంచనా వేశారు. అయితే ఇలాంటి మాంద్యాన్ని భార త్‌ గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని తమ నివేదికలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ దేశ ఆర్థిక ప్రగతిపై సత్వర ప్రభావం చూపించబోదని ఆ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?