ఒక్కరోజే 79

జిహెచ్‌ఎంసి భయపెడుతున్న కరోనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా విషయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) భయపెడుతోంది. కరోనా వైరస్‌ మూడు జిల్లాల పరిధిలో విజృంభిస్తోంది. రాష్ట్రం లో ఒక్కరోజే 79 కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనే నమోదుకావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరో నా కేసుల సంఖ్య 1275కి పెరిగాయి. సోమవారం నా డు 50 మందిని డిశ్చార్జి చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు డిశ్చార్జి చేసిన వారి సంఖ్య 801కి చేరింది. ఇంకా 444 మంది చికిత్స ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 30 మంది మరణించారు. కాగా, వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ప్రభుత్వం తెలిపింది. యాదాద్రిలో నాలుగు కేసులు నమోదయినప్పటికీ, అవి ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులకు చెందినవిగా చూపించింది. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

DO YOU LIKE THIS ARTICLE?