ఏకగ్రీవం

69 ఎంపిటిసి, రెండు జడ్‌పిటిసి స్థానాలు ఏకగ్రీవం
హైదరాబాద్‌ : రాష్ట్రంలో జరగుతున్న మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల తొలివిడతలో 69 ఎంపి టిసి, రెండు జడ్‌పిటిసి స్థానాలు ఏక గ్రీవమ య్యాయి. తొలివిడతలో మొత్తం 2166 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతు న్నాయి. చివరి వరకు ఏకగ్రీవాల కోసం అధి కార పార్టీ విశ్వప్రయత్నాలు చేసినా అవి అం తగా ఫలించలేదు. అయితే ఏకగ్రీవం అయిన వాటిలో మాత్రం అధికార పార్టీ వారిదే అగ్ర స్థానం. ఏకగ్రీవమైన 69 ఎంపిటిసి స్థానాల్లో 67 స్థానాలు టిఆర్‌ఎస్‌ వారు కాగా, రెండు స్థానాలు కాంగ్రెస్‌ వారు దక్కించుకున్నారు. ఏకగ్రీవమైన ఎంపిటిసి స్థానాలను పరిశీ లిస్తే… మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తి, మెదక్‌, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కటి, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో రెండేసి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో మూడేసి, భూపాలపల్లి జిల్లాలో ఐదు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మహబూబాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆరేసి స్థానాలు ఏకగ్రీవం కాగా అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 10 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో జనగాంలో ఒకటి, నల్లగొండలో ఒక స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. తొలివిడతలో మొత్తం 197 జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా జగిత్యాల జిల్లాలో ఒకటి, నిజామాబాద్‌ జిల్లాలో ఒక జడ్‌పిటిసి స్థానాన్ని టిఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?