ఎల్‌ఆర్‌ఎస్‌ పరిశీలన 15 రోజుల్లో పూర్తి

అదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అదేశాలు జారీ చేశారు. ప్రక్రియ మొత్తాన్ని 15 రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది. 2020 లో ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా దాదాపు 25 లక్షల దరఖాస్తు లు వచ్చాయి. వివిధ కారణాల తో వాటి పరిశీలన జరగలేదు. దీనితో నిర్దేశిత గడువులోగా దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు దశల్లో పరిశీలన చేయాలని తెలిపింది. మొదటి దశలో దరఖాస్తులన్నింటిని గ్రామాలు, వార్డులు, సర్వే నంబర్లు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించాలని సూచించింది. రెండో దశలో అధికారుల బృందం క్లస్టర్లను తనిఖీ చేసి రిమార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకోసం రెవెన్యూ,నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో జిల్లా కలెక్టర్లు అధికారుల బృందాలను నియమించాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో.. సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌ లేదా కలెక్టర్లకు నివేదించాలని అదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 15 రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని పేర్కొంది.నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో జిల్లా కలెక్టర్లు అధికారుల బృందాలను నియమించాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో.. సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌ లేదా కలెక్టర్లకు నివేదించాలని అదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 15 రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని పేర్కొంది. నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో జిల్లా కలెక్టర్లు అధికారుల బృందాలను నియమించాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో.. సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌ లేదా కలెక్టర్లకు నివేదించాలని అదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 15 రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?