ఎంఎల్‌సి స్థానానికి కవిత నామినేషన్‌

ప్రజాపక్షం/నిజామాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆమె నేరుగా నిజామాబాద్‌ చేరుకుని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా శాసనసభ్యులతో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి నారాయణరెడ్డికి సమర్పించారు. ఆమెతో పాటు ఎంఎల్‌ఎలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, జీవన్‌రెడ్డి, షకీల్‌, సురేందర్‌, ఎంఎల్‌సిలు వి.జి.గౌడ్‌, లలిత, నిజామాబాద్‌ జెడ్‌పి చైర్మన్‌ విఠల్‌రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌తో పాటు కార్పొరేటర్లు, జెడ్‌పిటిసి సభ్యులు తరలివచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?