ఎంఎల్‌సి ఎన్నికలు టిఆర్‌ఎస్‌కు చెంపపెట్టు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఎంఎల్‌సి ఎన్నికల తీర్పు టిఆర్‌ఎస్‌కు చెంప పెట్టు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంఎల్‌సిలు ఒడిపోయారని, కారులో గాలిపోయిందని. పంక్చర్‌ కావడాని కి సిద్ధంగా ఉందని, బైర్లు కమ్ముకున్న టిఆర్‌ఎస్‌ పెద్ద నేతలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే గెలిచిన ఎంఎల్‌ఎలంతా కెసిఆర్‌ కుంటుంబానికి బానిసలయ్యారని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంపిలంతా కెసిఆర్‌ కుటుంబడానికి పెద్ద బానిసలవుతారని ఆయన అన్నా రు. బిజెపి రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను కమిటీ సభ్యులు లక్ష్మణ్‌కు గురువారం పార్టీ కార్యాలయంలో అం దజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్రం లో కెసిఆర్‌, కెటిఆర్‌లకు ప్రధాని మోడీ ఫోబియా పట్టుకుందని, ఫలితంగా వారు కుప్పిగంతులు వేస్తున్నారని, నిద్రలో కూడా వారు మోడీ పేరునే కలవరిస్తున్నారన్నారు. దేశానికి కావాల్సింది చౌకీదార్లు కాదని, జిమ్మేదార్లు కావాలని కెటిఆర్‌ పేర్కొనడం హాస్యాస్పదమని, ప్రధాని మోడీ కామ్‌ దార్‌ అని, కెసిఆర్‌, కెటిఆర్‌ నామ్‌ దార్‌లని, రాష్ట్రంలో జిమ్మేదార్ల పాలన కాకుండా జమీందార్ల పాలన కొనసాగుతుందని, కెసిఆర్‌, కెటిఆర్‌ మాట్లాడేవి చప్పట్లు కొట్టించుకోవడానికి మాత్రమే పనికొస్తాయన్నారు. శతకోటి లింగాల్లో కెసిఆర్‌ ఓ బోడి లింగమని ఆయన ఎద్దేవా చేశారు. ఊసరవెల్లి కూడా సిఎం కెసిఆర్‌ మారుస్తున్న మాటలను చూసి సిగ్గుపడుతుందన్నారు. తండ్రి కొడుకులు రంగుల మాస్టర్లుగా తయారయ్యారని, కేంద్ర పథకాలను కాపీ కొట్టి టిఆర్‌ఎస్‌ ప్రజలను మభ్యపెడుతుందన్నారు. కొండగట్టు ప్రమాద బాధితులను సిఎం కనీసం పరామర్శించకపోవడం బాధాకరమని, లాంటి సమస్యలను పట్టించుకోని కెసిఆర్‌ హిందువు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. డబ్బుల సంచులు ఉన్నవారికే టిఆర్‌ఎస్‌ లోక్‌సభ టికెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల అనంతరం బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పెను మార్పులు సంభవిస్తాయని, టిఆర్‌ఎస్‌ సంగతి తెలుస్తామని, వారి అవినీతి భరతం పడుతామన్నారు. పలువురు ఇతర పార్టీల కీలక నేతలు బిజెపిలో చేరనున్నారు.
‘వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ’గా బిజెపి మ్యానిఫెస్టో
బిజెపి మ్యానిఫెస్టోను ‘వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ’గా రూపొం దించామని, గురువారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేస్తామని లక్ష్మణ్‌ చెప్పారు. ప్రజల మ్యానిఫెస్టోను రూపొందించేందుకు 15 రంగాల వారిని కలసి ‘తెలంగాణ మన్‌ కి బాత్‌ మోడీకే సాత్‌’ అని తయారుచేశామని ఆయన చెప్పారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్‌రావు మాట్లాడుతూ మురళీధర్‌ రావుపై నమోదైన కేసులో చేసిన ఆరోపణలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?