ఉస్మానియాలో ఉద్రిక్తం

కాంగ్రెస్‌, పోలీసుల మధ్య తోపులాట
కింద పడిన వి. హనుమంతరావు
ఒయును నిర్వీర్యం చేస్తున్న సిఎం
స్థల ఆక్రమణపై గరవ్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
సిపి అంజనీకుమార్‌ పాత్రపై అనుమానాలు
పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ శతవార్షికోత్సవాలకు హాజరైన రాష్ట్రపతి కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే విశ్వవిద్యాలయంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేయాలని కెసిఆర్‌ దుర్మార్గంగా ఆలోచిస్తున్నారన్నారు. కబ్జాలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పాత్రపై అనుమానాలు వస్తున్నాయని, ఈ కేసులో కమిషనర్‌ ఎందుకు నేరుగా జోక్యం చేసుకుంటున్నారని, ఎవరి ఒత్తిడి ఉన్నదని ప్రశ్నించారు. కబ్జా వ్యవహారంపై తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, పిసిసి మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, ఎఐసిసి కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంఎల్‌సి రాములు నాయక్‌ తదితరుల ప్రతినిధి బృందం డిడి కాలనీలోని ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను పరిశీలించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలో కాం గ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాటలు, వాగ్వావాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పిసిసి మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు కిందపడిపోగా.. ఆయనను కాంగ్రెస్‌ నేతలు, పోలీసులు పైకి లేపారు. దీంతో పోలీసుల తీరు పై హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సేపు ఆయన అక్కడే బైఠాయించారు. ఒయు భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేతలు పోలీసులను నిలదీశారు. కబ్జా చేస్తున్న వ్యక్తిని వదిలి, కబ్జా జరుగుతుందని చెబుతున్న వారిపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ స్థలంలో వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని, సివిల్‌ మ్యాటర్‌లో పోలీసుల జోక్యం తగ్గాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒయు స్థలంలో నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, తగిన చర్య తీసుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ప్రజల గుండె అని, నిజాం స్థాపించిన యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందని, తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల విద్యార్థులకు కూడా విద్యను అందించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీ కీలకమైన పాత్ర పోషించిందని, విద్యార్థులు, టీచర్ల పోరాటాలు, త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియాలో విద్య మరింత మెరుగు పడుతుందని తాము ఆశించామని, కానీ సిఎం కెసిఆర్‌ దుర్మార్గంగా ఆలోచించి యూనివర్సిటీతో సహా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవే టు యూనివర్సిటీలను ప్రోత్సహిచండం అన్యాయమన్నారు. ఒయు విషయంలో ప్రతి తెలంగాణ వ్యక్తి సెంటిమెంటుతో ఉంటారని, గత కొన్ని రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ విస్తీర్ణం తగ్గిపోతుందని, ఇది భావితరాల కు ప్రమాదకర హెచ్చరిక అని పేర్కొన్నారు. యూనివర్సిటీని కాపాడాలని, భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, విశ్వవిద్యాల య పరిరక్షణకు విద్యార్థులు, టీచర్ల అందరూ తమతో కలిసి పోరాడాలని చె ప్పారు. భూములు కాపాడాలని అడిగితే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. యూనివర్సిటీ రిజిస్టర్‌, అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభు త్వ భూములు కాపాడాల్సిన జిపిఒలు కబ్జాదారులకు వంతపాడుతున్నారని ఆరోపించారు. ఈ స్థలం విషయంలో అదే జరుగుతుందని, ఒక ఉన్నత స్థా యి హోదాలో పనిచేసిన వ్యక్తి ఇలా చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆక్రమణను ఆపకపోతే తాను ఇక్కడే బైఠాయిస్తానని హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?