ఉపాధి హుష్‌

ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో  : 2005లో యుపిఎ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. పేదలందరు పస్తులతో ఉండకుండా కూలీ పనులు కల్పించడమే ఈ పథకం ఉద్దేశ్యం. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలుపర్చడం లేదు. ప్రభుత్వ ఆర్భాటమే తప్ప దీని లక్ష్యం మాత్రం నేరవేరడం లేదు. కూలీలకు పని కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పని చేసిన కూలీలకు కూలీ డబ్బులు కూడా సకాలంలో చెల్లించని పరిస్థ్ధితి నెలకొంది. దీంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 2 లక్షల 45వేల 573 కుటుంబాలకు జాబ్‌కార్డులు మంజూరు చేయగా ఇందులో 5లక్షల 69 వేల 570 సభ్యులు నమోదై ఉన్నారు. 2019 సంవత్సరంలో ఈ పథకం కింద 1,27,992 మంది కుటుంబాల్లోని 2,21,132 మంది కూలీలకు అధికారులు పని కల్పించారు. పథకం నిబంధనల ప్రకారం ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజులు పని దినాలు కల్పించాల్సి ఉండగా కేవలం 2,334 కుటుంబాలకు మాత్రమే పని కల్పించడంతో ఈ పథకం అమలు తీరు తెన్నులు ఏలా ఉన్నాయో ఇట్టే స్పష్టమవుతుంది. దీనిపై ‘ప్రజాపక్షం’ ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లాలో మొత్తం 23 మండలాలు, 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో భూ స్వాములు, ఉద్యోగుల కంటే నిరుపేదలే అనేకమంది ఉన్నారు. వీరింది రేక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. ఈ పరిస్థితులను పరిగనలోకి తీసుకొని వామపక్షాల పోరాట ఫలితంగా 2005 అప్పటి యుపిఎ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పుణ్యమా అంటూ లక్షాలది మంది పేదలకు పనులు దొరుకుతున్నాయి. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2లక్షల 45వేల 573 కుటుంబాలకు ఈ పథకం ద్వారా జాబ్‌ కార్డులు అధికారులు జారీ చేశారు. ఇందులో 5లక్షల 69వేల 570 మంది సభ్యులు నమోదై ఉన్నారు. 2019 సంవత్సరంలో 62.39లక్షల పనిదినాల లక్ష్యంగా అధికారులు కూలీలకు పనులు కల్పిచమని చెబుతున్నారు. పథకంలో 1లక్ష 27వేల 992 కుటుంబాలలో 2 లక్షల 21 వేల 132 మంది కూలీలకు పనులు కల్పించినట్లు అధికారులు అధికారికంగా తెలియపర్చారు. ఇంత వరకు బాగానే ఉన్న కూలీలకు మాత్రం 100 రోజులు పని కల్పించడంలో పూర్తిగా విఫలమైయ్యారన్నది వారు తెలిపిన లెక్కలను బట్టే స్పష్టమవుతోంది. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనులు చేసిన 1లక్షల 27వేల 992 కుటుంబాల్లో 100 రోజులు పని కల్పించిన కుటుంబాలు కేవలం 2394 మాత్రమే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లితే 23 మండలాల పరిధిలో 100 రోజులు పని కల్పించిన కుటుంబాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?