ఉద్యోగులంతా విధులకు రావాల్సిందే

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాపక్షం / హైదరాబాద్‌  : లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ అధికారులు, సిబ్బంది అంద రూ విధులకు హాజరుకావాలని ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ (పొలిటికల్‌) ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక మినహాయింపులు కలిగిన వారు మినహా అందరూ విధులు హాజరుకవాల్సిందేనని పేర్కొన్నారు. కాగా, ఇది వరకు 20 శాతం, 33 శాతం పద్ధతిన విధులకు హాజరుకావాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.
ప్రైవేటు వర్సిటీల అనుమతికి ఆర్డినెన్స్‌
రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రభు త్వం జారీ చేసింది. ‘తెలంగాణ ప్రైవేటు విశ్వ విద్యాలయాల (సవరణ) చట్టం- 2020’ పేరుతో ఈ ఆర్డినెన్స్‌ అయింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ కాగా, బుధవారం ఆర్డినెన్స్‌ జారీ అయింది.

DO YOU LIKE THIS ARTICLE?