ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక రోడ్‌షో

లక్నో: కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం తొలిసారి లక్నోలో రోడ్‌షో చేపట్టారు. వేలా ది మంది హర్షధ్వనాలు చేస్తుండగా ఆకె వాహనశ్రేణి మెల్లిగా ముందుకు కదిలింది. ఆమె సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తోడురాగా ఈ రోడ్‌షోను ప్రియాంక గాంధీ కొనసాగించారు. బస్సుపైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఈ రోడ్‌షోలో రాహుల్‌ గాంధీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ విభాగం ఇన్‌ఛార్జి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర కాంగ్రెస్‌ నాయకులు కూడా పాల్గొన్నారు. లక్నో నగరంలోని అమౌసి విమానాశ్రయం నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు 25 కిమీ. మేర ఈ ప్రదర్శన సాగింది. ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా ‘రండి, కొత్త భవిష్యత్తును మనమంతా కలిసి నిర్మిద్దాం. కొత్త రాజకీయాలకు నాతో కలిసి రండి. ధన్యవాదాలు’ అన్నారు. రోడ్‌షో కొనసాగుతున్నప్పుడు లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకర్షించడానికి ఆ ముగ్గురు కాంగ్రెస్‌ ప్రముఖ నాయకులు ప్రయత్నించినప్పుడు వారి వాహన శ్రేణిపై గులాబీ రేఖ లు, బంతిపూల దండలను ప్రజలు కురింపించారు. వారి ‘రథం’ కదులుతూ పోతున్నప్పుడు ప్రజలు ఫోటోలు కూడా తీశారు. దారి పొడుగున ఆహార పొట్లాలను, నీరు, టీ వంటివి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ దారిన వెళ్లే ప్రజలు అందించారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా పాటలు వినిపించారు. సింహంపై ‘దుర్గామాతా’ అవతారంలో ప్రి యాంక గాంధీ ఉన్న పోస్టర్లను కూడా ప్రదర్శించారు. మరి కొన్ని పోస్టర్లలో ఆమెకు, ఇందిరా గాంధీకి ఉన్న పోలికలను ప్రదర్శించారు. కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలైతే ఆమె ఫోటో ఉన్న టి-షర్టులను ధరించారు. ‘లక్నోలోని నెహ్రూ భవన్‌ వద్ద ప్రియాంక సేన దాదాపు సంబరాలు చేసినంతగా అనిపించింది’ అని ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర తివారి తన కారులో ప్రియాంక గాంధీకి ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆయన కారు బ్యానర్‌లో ‘ప్రియాంక వచ్చేసింది… మోగింది… ఇక అవినీతికిక నూకలే…’ అని ఉంది. ‘రాజకీయాల్లోకి ప్రియాంక గాం ధీ ప్రవేశం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో కోల్పోయిన లోక్‌సభ స్థానాలని కాంగ్రెస్‌ తిరిగి పొందగలదు’ అని యుపి కాంగ్రెస్‌ కమి టీ ప్రతినిధి రాజీవ్‌ బక్షి విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇద్దరు ప్రధాన కార్యదర్శు లు… ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా లక్నోలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఫిబ్రవరి 12,13,14 తేదుల్లో పార్టీ కార్యకర్తలతో మాటామంతీ నిర్వహించనున్నారని సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె స్‌ ప్రియాంక గాంధీపై పెద్ద ఆశలు పెట్టుకుని ఉంది. ఆమె కాంగ్రెస్‌ అదృష్టాన్ని తిరిగి పునరుద్ధరించగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిధిలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో బిజెపి కంచుకోటలుగా చెప్పుకునే స్థానాలున్నాయి.. వాటిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఎంపిగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లున్నాయి. వీటిపై ప్రియాంక ప్రత్యేక దృష్టిపెట్టనున్నారని తెలుస్తోం ది. తన కుటుంబ సభ్యుల నియోజకవర్గాలైన అమేథి, రా య్‌బరేలి కాకుండా బయట మొదటిసారిగా ప్రియాంక ప్రచారం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూ ర్‌, ఫుల్‌పుర్‌లలో కాంగ్రెస్‌ ఘోరంగా అపజయం పాలైందన్నది ఇక్కడ గమనార్హం. 2009 నుంచి 2014 మధ్య కాలంలో కాంగ్రెస్‌ ఓట్ల వాటా 50 శాతం తగ్గిపోయింది. 2014 ఎన్నికల్లో అమేథి, రాయ్‌బరేలి సీట్లను మాత్రం కాంగ్రెస్‌ కాపాడుకోగలిగింది. అంతకు ముందు కాంగ్రెస్‌కు 21 సీట్లుండేవి. ఉత్తర్‌ప్రదేశ్‌కు ఇద్దరు ప్రధాన కార్యదర్శులను ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం అవుతోందని ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి ద్విజేంద్ర త్రిపాఠి చెప్పారు. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు బిజెపి, ఎస్‌పి-బిఎస్‌పి కూటమిని ఎదుర్కొనే స్థయిర్యం పొందారని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?