ఈత సరదా… ప్రాణాలు తీసింది

చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి
మహబూబాబాద్‌ జిల్లాలో విషాద ఘటన
ప్రజాపక్షం / మహబూబాబాద్‌ ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బోధ్‌ తండాకు చెంది న నలుగురు చిన్నారులు శనివారం సాయంత్రం తుమ్మల చెరువు లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఇస్లావత్‌ లోకేష్‌ (10), ఇస్లావత్‌ ఆకాష్‌ (12), బొడా దినేష్‌ (10), బొడా జగన్‌ (14) చెరువులో మునిగి ప్రాణాలు కోల్పో వడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

DO YOU LIKE THIS ARTICLE?