ఇల్లు విడిచి బయటకు రావొద్దు

ఏప్రిల్ 14 వరకూ దేశం లాక్ డౌన్
ఈ మూడు వారాలు ఎంతో కీలకం
జాతిని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : నేను మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా. ఈ మూడు వారాలు ఎంతో కీలకం. ఇల్లు విడిచి ఎవరూ బయటికి రావొద్దు. మరో 21 రోజులు మనం ఈ లాక్ డౌన్ పాటిస్తే కరోనాను అరికట్టవచ్చు. ఈ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అని… ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. మనం ముందున్న ఏకైక మార్గం ఇంటి నుంచి బయటకు రాకపోవడం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం అని మోడీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతీ నగరం ప్రతి ఊరు ప్రతీ వీధి లాక్ డౌన్ అన్నారు. ఈ 21 రోజులు మన ఇంట్లో మనం ఉండకపోతే పరిస్థితి చేజారి పోతుందని హెచ్చరించారు.
ఏ పరిస్థితి అయినా సరే ఇంటి నుంచి బయటకు రావొద్దని మోడీ హెచ్చరించారు. లాక్ డౌన్ నిర్ణయం ప్రతీ ఇంటికి లక్ష్మణ రేఖ అని మోడీ ఈ సందర్బంగ దేశ ప్రజలు తెలియజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?