ఇన్‌ఫార్మర్ల నెపంతో గ్రామస్థుల కాల్చివేత

ముంబయి: మహారాష్ట్రలో అనుమానిత మావోయిస్టులు ముగ్గురు గ్రామస్తులను పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో కాల్చి చంపారు. గత సంవత్సరం జరిగిన ఆపరేషన్‌లో 40మంది నక్సల్స్‌ని చంపిన దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు అధికారులు భావించారు. మంగళవారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌ నుండి బమ్రాగడ్‌ తాలూకాలోని కోస్‌ఫుంది ఫటా సమీపంలో కసనాసుర్‌ గ్రామంలో కి నక్సల్స్‌ ఆయుధాలతో ప్రవేశించి గ్రామస్తులైన మాలు మదవి, కన్నా మడవి, లల్స్‌ కుడ్‌యెటిలను ఇంటినుంచి బయటకు ఈడ్చుకెళ్లి కాల్చిచంపినట్లు తెలిపారు. గత ఏప్రిల్‌లో తూర్పు మహారాష్ట్ర జిల్లా లో జరిగిన కసనూర్‌ నక్సల్స్‌ ఉనికిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లుగా అనుమానించారని, హత్యానంతరం నక్సల్స్‌ గ్రామాన్ని విడిచివెళుతూ 2018 ఏప్రిల్‌లో జరిగిన మృతి చెందిన నక్సల్స్‌కు ప్రతీకారంగా ఈ చర్య చేపటామని బ్యానెర్‌ ద్వారా తెలియచేశారని పోలీసు అధికారి వెల్లడించారు. ఘటనానంతరం పోలీసులు హుటాహుటిన మహారాష్ట్ర బోర్డర్‌ ప్రాంతంలో ఉన్న బమ్రాగడ్‌కు చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు.గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్‌ శైలేష్‌ బల్కవాడె మాట్లాడుతూ .. కాల్చివేయబడ్డ గ్రామస్తులు పోలీసు ఇన్‌ఫార్మర్స్‌ కాదని, ఈ హత్యలవెనుక 60మంది మావోయిస్టుల కుట్ర ఉందన్నారు. గత సంవత్సరకాలంలో 50మంది నక్సల్స్‌ ఘర్షణలో పోలీసులదే పైచేయిగా ఉందన్నారు. నిషేధింపబడిన ప్రాంతాలలో నక్సల్స్‌ భయం ఉన్నప్పటికీ గ్రామస్తులు చాలా సందర్భాలలో నక్సల్స్‌ పెట్టిన బ్యానర్స్‌ను నాశనం చేసినట్లు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?