ఇంటర్‌ పరీక్షా ఫలితాలు అతివలదే అందలం

మొదటి సంవత్సరం 60.5%

బాలికలు : 66 శాతం, బాలురు: 55 శాతం

రెండవ సంవత్సరం 64.8%

బాలికలు : 70.8 శాతం, బాలురు: 58.2 శాతం

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 60.5 శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.8 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో బాలికలు 66శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 55 శాతం ఉత్తీర్ణత సా ధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 70.8 శాతం, బాలురు 58.2 శాతం ఉత్తీర్ణత సా ధించారు. మొదటి సంవత్సరం జనరల్‌ 4,09,133 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కాగా 43,520 మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్‌లో 53.2 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 67.8 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 41శాతం ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో 3,82,534 మంది జనరల్‌ విద్యార్థులు, 68,960 ప్రైవేట్‌ విద్యార్థులు ఒకేషనల్‌లో 35,737 మంది రెగ్యులర్‌, 3,121 మంది ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 67.7 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలిక లు 79.6 శాతం, బాలురు 57.9 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చేల్‌ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉండగా 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో 29 శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చేల్‌ జిల్లా 76 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో, కొమరం భీం జిల్లా 75 శాతం ఫలితాలతో రెండో స్థానంలో, 34 శాతం ఫలితాలతో మెదక్‌ చివరి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఫలితాలతో పోల్చితే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పడిపోయింది. మొదటి సంవత్సరంలో గత ఏడాది 62.73 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరం 60.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో గత ఏడాది 67.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 64.8 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఒకేషనల్‌లోనూ ఫలితాలు గత సంవత్సరం కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. కాగా, మే 14 నుంచి అడ్వాన్స్‌ సప్లి మెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్ధన్‌ రెడ్డి తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?