ఆ నలుగురికి నోటీసులు

ఎంఎల్‌సిలు ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్‌, ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డిలకు హైకోర్టు తాఖీదులు
మండలి చైర్మన్‌, కార్యదర్శులకు కూడా…

ప్రజాపక్షం/హైదరాబాద్‌ లీగల్‌: టిఆర్‌ఎస్‌ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్‌ శాస నమండలి పక్షాన్ని విలీనానం కావడాన్ని సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంఎల్‌సిలుగా గెలుపొందిన ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌, ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డిలతోపాటు మండలి చైర్మన్‌, కార్య దర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ నలుగురితో కూడిన కాంగ్రెస్‌ పక్షం ఇచ్చిన లేఖ కు అనుగుణంగా అప్పటి మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాదులు గిన్నె మల్లేశ్వరరావు, సి. బాలాజీలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం విచారించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ వ్యాజ్యాన్ని విచారించి ప్రతివా దులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తర ఫు లాయర్‌ ఐ.మల్లికార్జునశర్మ వాదిస్తూ ఎంఎల్‌ సిలు ఇచ్చిన లేఖకు అనుగుణంగా మండలి చైర్మన్‌ విలీన నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే శాసనమండలి బులిటెన్‌ ప్రకటించడం చెల్లద న్నారు. ఆ నలుగురు ఎంఎల్‌సిలు పార్టీ ఫిరాయించారని, పార్టీ ఫిరాయింపుల కింద వారిపై చర్యలు లేకపోగా వారు కోరిన మేరకు కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి పక్షాన్నే టీఆర్‌ఎస్‌ పక్షంలోకి విలీనం చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. వాదనల అనంతరం వారితోపాటు ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?