ఆసీస్‌దే సిరీస్‌

అబుదాబి: పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఆసీస్‌ 3 కైవసం చేసుకుంది. మరోవైపు పాక్‌ హ్యాట్రిక్‌ ఓటములతో పేలవమైన ఆటను ప్రదర్శించింది. భారత్‌ నుంచి మొదలైన ఆసీస్‌ గెలుపుల పరంపరా ఇక్కడ పాక్‌పై కూడా కొనసాగుతున్నది. భారత్‌పై హ్యాట్రిక్‌ విజయాలతో వన్డే సిరీస్‌ను ఛేజిక్కించుకున్న ఆస్ట్రేలియా తాజాగా పాక్‌పై కూడా అదే జోరును ప్రదర్శిస్తోంది. ఇక పాక్‌పై ఆసీస్‌ సిరీస్‌ గెలవడంలో కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన ఫించ్‌.. మూడో వన్డేలో (90) పరుగులు చేసి ఔ టయ్యాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా డకౌట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ ఫించ్‌ ఆసీస్‌ను ఆదుకున్నాడు. మంచి నాయకుడిగా జట్టును ముందుండి నడిపించా డు.. అతనికి గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ (71), పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(47)లు అండగా నిలిచారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 44.4 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్లు ఆరం భం నుంచే పాక్‌ను కట్టడి చేశారు. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(46), ఇమాద్‌ వసీమ్‌(43), ఉమర్‌ అక్మల్‌(36), షోయబ్‌ మాలిక్‌(32)లు మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా నాలుగు పాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లతో విజయంలో పాల్పంచుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?