ఆగని కరోనా…

భారత్‌లో కొత్తగా 325 మరణాలు
24 గంటల్లో 11,502 కొత్త కేసులు
3,32,424కు చేరిన బాధితులు, 9,520కి పెరిగిన మృతులు
కేసుల్లో నాల్గొవ స్థానం, మరణాల్లో 9వ స్థానం
మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ
చెన్నై సహా తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. వరుసగా మూడు రోజు ల నుంచి 11 వేలకు పైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3.32 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 11,502 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,424కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వ్లెలడించింది. 1,53,106 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,69,797 మంది కరోనావైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్‌లో రికవరీ రేటు 51.07గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో బాధితుల సంఖ్య కంటే కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్యే అధికంగా ఉండడం కాస్త ఊరట కలిగిస్తుంది. కాగా, మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం 300లకు పైగా మంది మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఆదివా రం ఉదయం నుంచి సోమవారం ఉదయం నాటికి కొత్తగా 325 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 9,520కి చేరింది. ఆదివారం ఉదయం నుంచి మహారాష్ట్రలో కొత్తగా 120 మంది మరణించగా, ఢిల్లీలో 56, తమిళనాడులో 38 మం ది, గుజరాత్‌లో 29, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో 12 మంది చొప్పున, రాజస్థాన్‌, హర్యానాలో 10 మంది చొప్పు న, కర్నాటకలో ఐదుగురు, జమ్మూకశ్మీర్‌లో నలుగురు, తెలంగాణ, పుదుచ్చేరిలో ముగ్గురు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌లో ఇద్దరు చొప్పున, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌, ఒడిశాలో ఒకరు చొప్పున మరణించా రు. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ నాల్గొవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా, వరుసుగా రెండు, మూడు స్థానాల్లో బ్రెజిల్‌, రష్యా ఉన్నాయి. అదే విధంగా మరణాల్లో భార త్‌ 9వ స్థానంలో ఉన్నట్లు జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు తె లియజేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు మహారాష్ట్రలోనే అత్యధికంగా 3,950 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. మరణాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గుజరాత్‌లో 1,477, ఢిల్లీలో 1,327, పశ్చిమ బెంగాల్‌లో 475, మధ్యప్రదేశ్‌లో 459, తమిళనాడులో 435, ఉత్తరప్రదేశ్‌లో 399, రాజస్థాన్‌లో 292, తెలంగాణలో 185, హర్యానాలో 88, కర్నాటకలో 86, ఆంధ్రప్రదేశ్‌లో 84, పంజాబ్‌లో 67, జమ్మూకశ్మీర్‌లో 59, బీహార్‌లో 39 మంది, ఉత్తరాఖండ్‌లో 24 మంది, కేరళలో 19 మంది, ఒడిశాలో 11 మంది, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోంలో 8 మంది చొప్పున, హిమాచల్‌లో ఏడుగురు, చండీగఢ్‌, పుదుచ్చేరిలో ఐదుగురు చొప్పున, మేఘాలయ, త్రిపుర, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే అత్యధిక కేసులు మ హారాష్ట్రలోనే నమోదయ్యాయి. 1,07,958 కేసులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో కొనసాగుతుంది. తమిళనాడులో 44,661 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 41,182, గుజరాత్‌లో 23,544, ఉత్తరప్రదేశ్‌లో 13,615, రాజస్థాన్‌లో 12,694, పశ్చిమ బెంగాల్‌లో 11,087, మధ్యప్రదేశ్‌లో 10,802, హర్యానాలో 7,208, కర్నాటకలో 7,000, బీహార్‌లో 6,470, ఆంధ్రప్రదేశ్‌లో 6,163, జమ్మూకశ్మీర్‌లో 5,041, తెలంగాణ లో 4,974, అసోంలో 4,049, ఒడిశాలో 3,909, పంజాబ్‌లో 3,140, కేరళలో 2,461, ఉత్తరాఖండ్‌లో 1,819, జార్ఖండ్‌లో 1,745, ఛత్తీస్‌గఢ్‌లో 1,662, త్రిపురలో 1,076 మందికి కరోనా సోకింది. అదే విధంగా గోవాలో 564 మంది, హిమాచల్‌లో 518 మంది కొవిడ్‌ 19 బారిన పడ్డారు. మణిపూర్‌లో 458, లడఖ్‌లో 549, చండీగఢ్‌లో 352, పుదుచ్చేరిలో 194, నాగాలాండ్‌లో 168 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యా యి. ఇక మిజోరాంలో 112, అరుణాచల్‌లో 91, సిక్కింలో 68, మేఘాలయలో 44 కేసులు, అండమాన్‌ నికోబార్‌లో 38, దాదర్‌ నగర్‌ హవేలీ, దామన్‌ డియోలో 36 కేసులు నమోదయ్యాయి. మరో 6,972 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?