ఆఖరి అంకం!

తుది దశ ఎన్నికల పోలింగ్‌ నేడే
8 రాష్ట్రాలు, 59 నియోజకవర్గాలు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడు దశల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరిది, ఏడవ దశ ఎన్నికల పోలింగ్‌ ఆదివారంనాడు జరుగుతుంది. 8 రాష్ట్రాల్లోని 59 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్‌ జరగబోతున్నది. పలు సున్నిత ప్రాంతా లు ఉండటంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ దశతో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసినట్లే. ఆదివారం సాయంత్రం నుంచి ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించుకోవచ్చు. అలాగే ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ వారణాసి నుంచి పోటీచేస్తున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖులు ఈసారి బరిలో నిలిచారు. పంజాబ్‌లోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఉత్తరప్రదేశ్‌లో కూడా 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. అలాగే పశ్చిమబెంగాల్‌లో 9 నియోజకవర్గాల్లోనూ, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 8 నియోజకవర్గాలు చొప్పున, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలు గు, జార్ఖండ్‌లో మూడు, ఛత్తీస్‌గఢ్‌లో ఒక నియోజకవర్గంలో ఈ దశలో పోలింగ్‌ జరుగుతుంది. 10.01 కోట్ల మంది ఓటర్లు ఈ విడతలో 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఎన్నికల నిర్వహణకు గాను ఎన్నికల సంఘం 1.12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిం ది. అలాగే ఆదివారంనాడు పనాజీలో ఒక ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మార్చిలో మృతిచెందిన కారణంగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. దీంతోపాటు తమిళనాడులోని నాలుగు నియోజకవర్గాలు సూలూరు, అరవకురిచి, ఒట్టాపిడరం, తిరుపరాంకుంద్రం నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గడిచిన ఆరుదశల లోక్‌సభ ఎన్నికల్లో సగటున 66.88 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఈసారి పోలింగ్‌తో అది 70 నుంచి 75 శాతం వద్ద ముగిసే అవకాశం వుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ 38 రోజులపాటు సాగింది. ఉత్తరప్రదేశ్‌లో వారణాసిపైనే అందరి దృష్టి పడింది. ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా మరో 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి అజయ్‌రాయ్‌, ఎస్‌పి, బిఎస్‌పి కూటమి నుంచి శాలినీ యాదవ్‌ పోటీలో వున్నారు. కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా, ఉత్తరప్రదేశ్‌

DO YOU LIKE THIS ARTICLE?