అసోం, పుదుచ్చేరిలో బిజెపి గెలుపు

న్యూఢిల్లీ : అసోం రాష్ట్రంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ బిజపి విజయభేరి మోగించంది. అసోంలో తన అధికారాన్ని నిలబెట్టుకోగా, పుదుచ్చేరిపై పట్టు సంపాదించింది. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 64 స్థానాల మైలురాయిని ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ నేతృత్వంలో బిజెపి సులభంగానే అధిగమించింది. అస్సాంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర పార్టీగా రి కార్డు సృష్టించనుంది. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడులో విస్తరించాలనుకున్న ఆ పార్టీ ఆశలు
నెరవేరలేదు. అయితే, అసోంలో అధికారాన్ని నిలబెట్టుకొని ఊరట పొందింది. పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించిన బిజెపి అక్కడ గెలవగలిగింది.

DO YOU LIKE THIS ARTICLE?