అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు

వివిపాట్‌ చీటీలు లెక్కించాలి
ఇవిఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయి
ఎన్నికలు సక్రమమని తేలితే క్షమాపణ చెప్తా
లగడపాటి రాజగోపాల్‌ సవాల్‌
హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలున్నాయని, వివి పాట్‌ చీటీలు లెక్కించాలని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. పోలింగ్‌ శాతం చెప్పటానికి ఎన్నికల కమిషన్‌కు ఒకటిన్నర రోజు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. గత నెలన్నర నుండి ఫలితాలపై తాను చాలా విశ్లేషణ చేసానని, ఇవిఎంలు టాంపరింగ్‌ చేశారని, చాలా మం ది ఆరోపించారన్నారు. అన్ని సక్రమంగా జరిగాయని తేలితే తాను క్షమాపణ చెప్తానన్నారు. లగడపాటి రాజగోపాల్‌ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. “తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు తన కు ఆశ్చర్యాన్ని కలిగించాయి. 2003 నుంచి అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలు చేశానని, పార్టీలు, మీడియాతో సర్వే వివరాలు పంచుకున్నా ను. ఎప్పుడూ సర్వే వివరాల్లో పెద్దగా తేడా రాలేదు. 12 సంవత్సరాల్లో తాము చేసిన సర్వే ఫలితాలు మొదటిసారి తారుమారయ్యాయి. పోలింగ్‌ శాతం వివరాలు చాలా ఆలస్యంగా వచ్చాయి.

DO YOU LIKE THIS ARTICLE?