అసత్య ప్రచారం

రూ.5 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు ఎపికి చెల్లించాలనడం అబద్ధం
తెలంగాణకే ఎపి రూ. 2600 కోట్లు ఇవ్వాలి
జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్‌, ఎండి డి.ప్రభాకర్‌రావు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రూ. 5 వేల కోట్ల విద్యుత్‌ వినియోగ బకాయిలు చెల్లించాలని గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఎపి ప్రభుత్వ వ్యవహారం ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కు డాంటే’ అన్నట్టు ఉందన్నారు. విద్యుత్‌సౌధలో శుక్రవారం జరిగిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపి విద్యుత్‌ సంస్థలే  తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు రూ.2600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తెలంగాణ విత్యు సంస్థలే వారికి ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రూ.5600 కోట్లు చెల్లించాలని ఎపి ప్రభుత్వం ఎన్‌సిఎల్‌టికి విన్నవించిందని, ఎపికి తెలంగాణా ఎం ఇవ్వాలి, తెలంగాణాకు ఎపి ఏమి ఇవ్వాలో తేల్చుకునేందుకు రావాలని లేఖలు కూడా రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య ఎవరికి ఏమి ఇవ్వాలో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. లెక్కలు తేలిస్తే ఎపి ప్రభుత్వమే తెలంగాణకు ఇంకా రూ.1100 కోట్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఎపి కంపెనీ, తెలంగాణ కంపెనీ ఒకే ఆడిట్‌ కంపెనీలలో ఉన్నాయని, ఒకవేళ తాము తప్పు చేస్తే ఆడిట్‌లో తేలుతుందన్నారు.తెలంగాణకు ఎపి డిస్కం నుండి రూ.1659 కోట్లు రావాలని, ఎపి జెన్‌కో నుండి టిఎస్‌ జెన్‌కోకు కూడా చెల్లింపులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 619 మంది ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు దేశించినా కూడా తీసుకోకుండా మళ్ళీ తిరిగి తెలంగాణాపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను తీసుకోమని తాను ఎపి అధికారులను కోరినా వారు ముందుకు రాలేదన్నారు. టెయిల్‌ పాండ్‌ కట్టుకున్నామని, అది రివర్స్‌ విధానంలో వాడుకుంటున్నామని, టెయిల్‌ పాండ్‌ ఉద్యోగుల విష యం, తుంగభద్ర పవర్‌ ప్లాంట్‌ విషయంలోనూ తేల్చుకుందామన్నారు. ఎపి ప్రభుత్వానికి, విద్యుత్‌ సంస్థలకు మధ్య సమాచార లోపం ఉందని ఆయన పేర్కొన్నారు. వివాదం ఉంటే ఇఆర్‌సికి ఫిర్యాదు చెయాలన్నా రు. పలు ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయని,అన్ని త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి అంటే కరెంట్‌ కొనాల్సిందేనని, కేంద్రంలో ఏవిధంగా ఉందొ అదే ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?