అలా చేయడం కుదరదు: ఐసిసి

దుబాయ్‌ : ఉగ్రవాదాన్ని ప్రొత్సాహిస్తున్న దేశాలను ఐసిసి బహిష్కరించాలని ఇటీవలే ఐసిసికి బిసిసిఐ లేఖ రాసింది. దీనిపై కొద్ది రోజులుగా చర్చిస్తున్న ఐసిసి ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని, ఇది క్రికెట్‌కు సంబంధించిన అంశమని ఐసిసి అంటుంది. ఈ విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం ఐసిసి నుంచి రాలేదు. కొన్ని రోజుల క్రీతం ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాలతో మిగతా క్రికెట్‌ దేశాలు సంబంధాలను తెంచుకోవాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి)కి బిసిసిఐ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను ఐసిసి తిరస్కరించినట్లు సమాచారం. ఐసిసి త్రైమాసిక బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించిన గవర్నింగ్‌ బాడీ సభ్యులు బిసిసిఐ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే ఐసిసి అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ బిసిసిఐ ప్రతిపాదనను అమలు చేయడం చాలా కష్టమని చెప్పారు. క్రికెట్‌కి రాజకీయాలతో సంబంధంలేదని ఐసిసి స్పష్టం చేసింది. తాము క్రికెట్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తామని ఐసిసి వివరించింది. ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లకు పూర్తి భద్రత కలిపిస్తామని ఐసిసి తెలిపింది. భద్రత విషయంలో ఎవరూ భయపడాల్సిన, అందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. అన్ని దేశ క్రికెట్‌ బోర్డులు అందోళన పడకుండా ప్రపంచకప్‌లో పాల్గొనాలని ఐసిసి పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?