అమ్మాయిలు అదరహో

వరుసగా ఐదోసారి ఎస్‌ఎఎఫ్‌ఎఫ్‌ టైటిల్‌ గెలుచుకున్న భారత్‌
బిరాత్‌నగర్‌ (నెపాల్‌): భారత మహిళా ఫుట్‌బాల్‌ జట్టు మరోసారి అదరగొట్టింది. వరుసగా ఐదోసారి ఎస్‌ఎఎఫ్‌ఎఫ్‌ ఉమెన్స్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు 3 తేడాతో ఆతిథ్య నెపాల్‌ను చిత్తు చేసి మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇంకోసారి ఈ చాంపియన్‌షిప్‌లో తమకు ఎదురులేదని భారత మహిళా జట్టు నిరూపించుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ వరుసగా 23వ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌ సునాయసంగా విజయాన్ని అందుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?