అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

కారు ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన సాహిత్‌రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: అమెరికాలోని నార్త్‌ కరోలినాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. కారు ఢీ కొట్టడంతో బొంగుల సాహిత్‌రెడ్డి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లి రహదారి ప్రమాదంలో దుర్మర ణం చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం నాలుగు గంటలకు వాకింగ్‌కు బయల్దేరిన సాహిత్‌రెడ్డిని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురయ్యాడు. కారు ఢీ కొట్టిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఎవరు అని పోలీసులు తెలుసుకునే వరకే నాలుగు గంటల సమయం పట్టింది. అప్పటి కే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కన్సల్టెన్సీలో ఉండే తోటి వారికి తెలపడంతో వారు హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సాహిత్‌రెడ్డి తల్లిదండ్రులు మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీ నల్లకుంటలోని పద్మాకాలనీలో నివా సం ఉంటున్నారు. తమ పెద్ద కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు తీరని దుఃఖంలో మునిగిపోయారు. సాహిత్‌రెడ్డి 2016 ఆగస్టు 15న న్యూజెర్సీకి ఎమ్మెస్‌ చేయడానికి వెళ్లాడని ఉద్యోగం వచ్చే సమయానికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?