అభిషేక్‌కు స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్‌ అర్హత
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌
బీజింగ్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. చైనాలోని బీజింగ్‌లో శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పి స్టల్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ బంగారు పతకం గెలుచుకున్నాడు. దాంతో పాటు అభిషేక్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు. దీంతో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు. మరోవైపు ఈ ఈవెంట్‌లో అర్హత సాధించిన రెండో షూటర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో రెండో సారి ప్రపంచకప్‌ బరిలోకి దిగిన అభిషేక్‌ తన సత్తా చాటుకున్నాడు. 10మీ ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన అభిషేక్‌ పసిడిని కైవసంచేసుకున్నాడు. మరోవైపు 240.4 పాయింట్లతో రష్యన్‌ షూటర్‌ ఆర్టెమ్‌ చెర్‌నో సోవ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌ ఫైనల్లో స్వర్ణం సాధించిన సౌరబ్‌ చైదరి కూడా ఈదే ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

DO YOU LIKE THIS ARTICLE?