అనుమతి లేకుండా ఆన్‌లైన్‌ క్లాసులా?

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలు పట్టవా?
ప్రభుత్వ వైఖరిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పుడు ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుంటే ఎందుకు కట్టడి చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలు, వారి పెద్దల సమస్యలు పట్టడం లేదా అని కూడా ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ విద్య కోసం ఫీజులు ముక్కు పిండి వసూ లు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారని నిలదీసింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ కెవి సాయినాథ్‌ దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ విచారణ సందర్భంగా పైవిధంగా ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ తరగతులకు కేంద్ర ప్రభు త్వం అనుమతి ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారమే తమ విద్యా సంస్థలు పనిచేస్తాయని ఇండిపెండెంట్‌ స్కూల్‌ మేనేజిమెంట్స్‌ అసోసియేషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు చెప్పడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టులు కూడా 20 శాతమే పనిచేస్తున్నాయని, అన్ని రంగాలపై కరోనా ప్రభావం ఉందని, జ్యుడిషియల్‌ అకాడమీలో ఒక ఎంప్లాయి చనిపోయాడని, ఇలాంటి సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు అవసరమా అని ప్రశ్నించింది. కరోనా వల్ల రంగాలు స్తంభించాయి. విద్యావ్యవస్థ ఆగితే నష్టం ఏమిటి. థార్‌ ఎడారి మధ్యలో ఉన్న బడికి ఇంటర్నెట్‌ ఉండదు. శామీర్‌పేట్‌ నల్సార్‌ లా వర్సిటీలోనే ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఉంటోంది. ఎసి గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోకూడదు. గిరిజన ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఎలా సాధ్యం. ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే మూడు ల్యాప్‌టాప్‌లను పేరెంట్స్‌ ఎలా ఇవ్వగలరు… అని ప్రశ్నించింది. రాష్ట్రం తరఫున ప్రత్యేక లాయర్‌ ఎ.సంజీవ్‌కుమార్‌ వాదిస్తూ, పాఠశాల విద్యపై మరో నెల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏడాదిలో 180రోజులు తరగతులు నిర్వహిస్తే సరిపోతుందన్నారు. కేంద్రం ఈనెల 31 వరకూ విద్యాసంస్థలను తెరకూడదని చెప్పిందన్నారు. కేంద్రం మాత్రం ఆన్‌లైన్‌, దూరవిద్య నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినా రాష్ట్రం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నలుగురు డిజిఒలు అనుమతి ఇస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ అనుమతులు ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రభుత్వ కమిటీ అధ్యయ నివేదిక కోసం విచారణ వాయిదా వేయాలని కోరారు. విద్యాసంవత్సరం ప్రారభించలేదని రాష్ట్రం చెబుతోందని, అలాంటప్పుడు ఆన్‌లైన్‌ విద్యకు ఎలా అనుమతి ఇస్తారనే సందేహాన్ని లేవనెత్తింది. ఆన్‌లైన్‌ నిర్వహించే యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం, సిబిఎస్‌ఇ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, కేంద్ర విద్యా సంస్థలను ప్రతివాదులుగా చేయాలని పి

DO YOU LIKE THIS ARTICLE?