అదుపు తప్పిన పెట్రో ధర

మూడు వారాల్లో పెట్రోల్‌పై రూ. 9.12, డీజిల్‌పై రూ. 11.01 పెంపు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్‌ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతుంది. శనివారం కూడా ధర లు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలను చమురు సంస్థలు పెంచా యి. మొత్తంగా మూడు వారాల్లో పెట్రోల్‌పై రూ. 9.12, డీజిల్‌పై రూ. 11.01 మేరకు భారాన్ని మోపాయి. తాజాగా పెరిగిన ధరలతో కలుపుకొని దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటరు రూ. 80.13 నుంచి రూ. 80.38కి పెరిగింది. అదే విధంగా డీజిల్‌ ధర రూ. 80.19 నుంచి రూ. 80.40కు చేరింది. ఈ మేరకు శనివారం చమురు సంస్థలు ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దేశ వ్యాప్తంగా ధరలు పెరగగా, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలపడంతో ఆ మేర కు ధరల్లో వ్యత్యాసం ఉండనుంది. ముంబయిలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 86.91 నుంచి రూ. 87.14కు పెరగగా, డీజిల్‌ ధర రూ. 78.51 నుంచి రూ. 78.71కి చేరింది. కాగా, డీజిల్‌ ధరలు వరుసుగా 21వ రోజు కూడా పెరగగా, పెట్రోల్‌ ధర మూడు వారాల్లో 20 సార్లు పెరిగింది. చమురు సంస్థలు ఈ నెల 7వ తేదీ నుంచి ధరలు పెంచడం ప్రారంభించగా, ఇప్పటి వరకు పెట్రోల్‌ ధర రూ. 9.12, డీజిల్‌ ధర రూ. 11.01 పెరిగింది. జూన్‌ 7కు ముందు లాక్‌డౌన్‌ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఆ తరువాత రోజు నుంచి వరుసగా 21 రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?