అతీగతీ లేదు!

గౌరవ వేతనాల్లేక అల్లాడుతున్న రిసోర్స్‌ పర్సన్స్‌
అమలుకు నోచుకోని ఉత్తర్వులు
హైదరాబాద్‌ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పని చేస్తున్న రిసోర్స్‌ పర్సన్స్‌(ఆర్‌పి)కు గౌర వ వేతనాలకు సంబంధించిన “ఉత్తర్వుల” కు అతీగతీ లేకుండా పోయింది. ఆర్‌పిలకు రూ.4వేల కనీస గౌరవ వేతనాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. పైగా వేతనాలు అడిగితే ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని ఆర్‌పిలు వాపోతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయానికి ముందు (ప్రభు త్వ రద్దు) గౌరవ వేతనం ఇస్తామని, కొత్తగా సర్కారు కొలువు దీరగానే తక్షణమే అమలు చేస్తామని టిఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలు తమ ను కలిసిన ఆర్‌పిలకు హామీ నిచ్చారు. దీనికి తోడుగా ఒక జిఒను కూడా విడుదల చేశారు. ఎన్నికల తర్వాత తమకు కనీస వేతనాలు అమలవుతాయని గంపెడాశతో ఎదురుచూసిన ఆర్‌పిలకు నిరాశే మిగిలింది. రేపు మాపు అంటూ కాలాన్ని ఇలాగే వెల్లదీస్తున్నారని ఆర్‌పిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ వసారి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ కొలువుదీరి సు మారు ఐదు నెలలు కావొస్తున్నప్పటికీ ఆ జిఒకు మాత్రం మోక్షం లభించడం లేదని పలువురు ఆందోళన చెందుతన్నారు. మెప్మా లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వేల మంది ఆర్‌పిలు పని చేస్తున్నారు. ఇందులో కొందరు దశాబ్దానికి పైగా పని చేస్తుండగా, మరి కొందరు ఐదేళ్లకు పైగా పని చేస్తున్నవారూ ఉన్నారు. స్వ యం సహాయక సంఘాలు, సమాఖ్యల ఏర్పాటు, పింఛన్ల సర్వే, ఆహార భద్రత కార్డు, స్వచ్ఛ సర్వేక్షన్‌,తడి, పొడి చెత్తపై అ వగాహన, తెలంగాణకు హరితహారం ఇలా కేంద్ర, రాష్ట్ర పథకాలు, కార్యక్రమాల అమలు తీరు, వాటిపై క్షేత్రస్థాయి లో అవగాహనను పెంచుతారు. పైగా పావలా వడ్డీ రుణాలను సక్రమంగా వచ్చేలా చూస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్న ఆర్‌పిలకు ప్రస్తు తం ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదు.దీంతో వడ్డీలపై వచ్చే లాభాలలో స్థానిక సమాఖ్యలు,సంఘాలనుంచి రూ. 2వేల నుంచి రూ.5వేల వరకు వేతనాన్ని పొందుతున్నారు. పలు సందర్భాల్లో నాటి మున్సిపల్‌ శాఖమంత్రి కెటిఆర్‌ సమక్షంలో జరిగిన సమీక్షలో ఆర్‌పిల పనితీరు ప్రస్తావనకు వచ్చింది. పైగా తమకు కనీస వేతనాలను ఇవ్వాలని వారు కెటిఆర్‌ను కోరారు. ఆతర్వాత శాసనసభ ఎన్నికలు రావ డం, తమకు న్యాయం చేయాలని ఆర్‌పిలు ప్ర భుత్వ పెద్దలను కలువడంతో నాడు సానుకూలంగా స్పందించారు. ఇందులో భాగంగానే ఆర్‌పిలకు కనీస వేతనంగా రూ.4వేలను మంజూరు చేశారు. ఈ మేరకు 2018 సంవత్సరం సెప్టెంబర్‌1న జి.ఒ ఎం.ఎస్‌.నెంబర్‌164ను విడుదల చే శారు. కానీ ఇప్పటి వరకు ఆ జివో అమలుకు నోచుకవడం లేదని వారు వాపోతున్నారు.పైగా ఆర్‌పిలకు ఆరోగ్య భద్ర త, డ్రెస్‌ కోడ్‌ అంశంపై పురపాలక శాఖ చర్చించి వాటిని అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఇప్పటికైనా తమ కనీస వేతనాలజీవోను అమలు చేయాలని ఆర్‌పిలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?