అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

ఛండీగ‌ర్‌: చట్టవిరుద్ధంగా బియ్యం రీసైకిల్‌ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు బియ్యం ట్రక్కులను సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు మూడు వేల బ్యాగుల్లో బియ్యం తరలిస్తుండగా పంజాబ్‌లోని బర్నాలా వద్ద పౌర సరఫరా అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నట్లు వెల్లడించారు. స్టార్‌ ఆగ్రో, కిసాన్‌ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్‌లోని రైస్‌మిల్లర్లకు కమీషన్‌ ఏజెంట్లు తక్కువ రేటుకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఈ సంస్థలపై ధనాలా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకొని మార్కెట్‌ కమిటీలకు ఫీజులు చెల్లించకుండా తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?