అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు

ప్రజాపక్షం/ కాళేశ్వరం: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు సోమవారం సిసి కెమెరాలు అమర్చారు.వీటిని స్థానిక పోలీస్ స్టేషన్ అనుసంధానం చేసి అంతర్ రాష్ర్ట ప్రాంతాల నుండి తెలంగాణా సరిహద్దు లోకి ప్రవేశించకుండా సిసి కెమెరాలతో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.సిసి కెమెరాల ద్వారా అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కదలికలను పోలీసులు నిరంతరం పరిశీలించనున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో తెలంగాణ సరిహద్దులు మూసివేసి కాళేశ్వరం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద స్థానిక ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం కాపలా కాస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?